డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి 'టిక్ టాక్ వీడియో'పై టీడీపీ నేత పంచుమర్తి విమర్శలు
- 'రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న' అనే పాటకు టిక్ టాక్
- హావభావాలు పలికిస్తూ ఆమె చేసిన వీడియో వైరల్
- పరిపాలన అంటే టిక్ టాక్లు చేయడం కాదన్న అనురాధ
సమస్యలు చెప్పుకునేందుకు తన వద్దకు వచ్చే ప్రజలకు మంత్రి పుష్ప శ్రీవాణి అందుబాటులోకి రారని అనురాధ ఆరోపించారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన చేతి గాజును అమరావతి పరిరక్షణ సమితికి ఇచ్చిన విషయంపై పుష్ప శ్రీవాణి చేసిన విమర్శలకు కూడా అనురాధ కౌంటర్ ఇచ్చారు. రాజధాని ప్రాంత రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే.. వారి దుస్థితి చూసి చలించిపోయిన భువనేశ్వరి... తన చేతి గాజును తీసి ఇచ్చారని చెప్పారు. రైతుల దీక్షకు మద్దతిచ్చిన భువనేశ్వరిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.