ఆసియా ఎలెవన్ జట్టులో పాక్ క్రికెటర్లు ఉండరు: బీసీసీఐ
- షేక్ ముజిబుర్ రెహ్మాన్ శత జయంతిని పురస్కరించుకుని టీ 20 మ్యాచ్ లు
- ఆసియా ఎలెవన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య పోటీ
- ఆసియా ఎలెవన్ జట్టులో ఆడే ఐదుగురు ఆటగాళ్లను ఎంపిక చేయనున్న గంగూలీ
దీనిపై బీసీసీఐ జాయింట్ సెక్రటరీ జయేశ్ జార్జ్ మాట్లాడుతూ.. ఆసియా ఎలెవన్ జట్టులో ఇరు జట్ల ఆటగాళ్లు ఉండే అవకాశం లేదని, పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆహ్వానం లేదన్న సమాచారం తమకుందని పేర్కొన్నారు. ‘ఆసియా ఎలెవన్ జట్టులో పాకిస్థాన్ ఆటగాళ్లు ఉండరన్న విషయంలో మాకు స్పష్టత ఉంది. ఆసియా ఎలెవన్ జట్టులో ఆడే ఐదుగురు ఆటగాళ్లను బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఎంపిక చేస్తారు. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే జట్టులో ఉండి ఒక్క ఓవర్ కూడా ఆడే అవకాశం లేదు’ అని అన్నారు.