చిరంజీవిగారు ఒక స్టేట్ మెంట్ ఇస్తే చిత్రపరిశ్రమ అంతా ఇచ్చినట్టే: దిశ ఘటనపై తమ్మారెడ్డి వ్యాఖ్యలు
- సంచలనం సృష్టించిన దిశ ఘటన
- స్పందించిన తమ్మారెడ్డి
- ఎలాంటి దేశంలో ఉన్నామా అనిపిస్తోందని వ్యాఖ్యలు
నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా న్యాయం జరగని పరిస్థితి ఉందని, ఎలాంటి దేశంలో ఉన్నామా అనిపిస్తోందని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఏమన్నా అంటే దేశభక్తి లేదంటూ అపవాదు భరించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై చిరంజీవి, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ మాట్లాడారని, కానీ సినిమా వాళ్లు మాట్లాడినంత మాత్రాన ఏం జరుగుతుంది? అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు.