వాళ్లు జైలుశిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేనే జైలుకెళతాను: పూనమ్ కౌర్
- తెలంగాణలో దారుణం
- ఘోరంగా కడతేరిన ప్రియాంక రెడ్డి
- భగ్గుమంటున్న పౌర సమాజం
ఈ నేపథ్యంలో, సినీ నటి పూనమ్ కౌర్ కూడా ఆవేశంతో స్పందించారు. ఇలాంటి జంతువులను చంపడానికైనా తాను సిద్ధమేనని అన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన క్రూరులు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకెళతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుల్లో ఒకరి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, ఇక్కడ మతం సమస్య కానేకాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ ఈ జనారణ్యంలోనే మనుషులు అతిభయంకరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యకు పరిష్కారాలు ఆలోచించాలే తప్ప రాజకీయాలు చేయాలని చూడొద్దని హితవు పలికారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో వీడియో పోస్టు చేశారు.