అమరావతి నిర్మాణంపై చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారు: మంత్రి బుగ్గన
- రైతులను బెదిరించి భూములను లాక్కున్నారని ఆరోపణ
- గ్రాఫిక్స్ లో అమరావతిని భూతల స్వర్గంగా చూపారు
- మా కిచ్చిన హామీలేమైనాయని రైతులు అడుగుతున్నారు
డ్రీమ్ కేపిటల్ అంటూ ఐదేళ్లు గ్రాఫిక్స్ తో గడిపారని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ తో మహా నగరాన్ని కడతామని కాలం గడిపారని మండిపడ్డారు. అలా ఆలోచిస్తే ప్రపంచంలో ఎన్నో నగరాలు ఇప్పటికే నిర్మాణం జరిగేవన్నారు. ఐదేళ్లలో ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. రాజధానిపై నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని అడిగారు. చంద్రబాబు చెప్పిన దానికి, చేసే దానికి పొంతన లేదన్నారు. 40 ఏళ్ల అనుభవమంటే ఇదేనా? అని ప్రశ్నించారు.