ఎంపీ4 వీడియో ఫైల్స్ రూపంలో వాట్సాప్ పై హ్యాకర్ల దాడి!
- ఇటీవలే వాట్సాప్ పై విరుచుకుపడిన 'పెగాసస్'
- హ్యాకర్లు దాడికి ప్రయత్నిస్తున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ వెల్లడి
- వీడియో ఫైల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన
గుర్తు తెలియని సోర్స్ ద్వారా వీడియో లింకులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ యూజర్లకు స్పష్టం చేసింది. ఫోన్ లో ఆటో డౌన్ లోడ్ ఆప్షన్ ను డిజేబుల్ చేయడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని పేర్కొంది. వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సైబర్ దాడుల తీవ్రత తగ్గుతుందని వెల్లడించింది.