విడుదలకి సిద్ధమైన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'
- వినోదభరితంగా సాగే కథాకథనాలు
- పూర్తయిన సెన్సార్ కార్యక్రమాలు
- ఈ నెల 15 వ తేదీన విడుదల
వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించడం విశేషం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. గతంలో ఆయన దర్శకత్వంలో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుందేమో చూడాలి.