'ఆవిరి'లో ఆ పాత్ర కోసం చాలామందిని ట్రై చేశాను: దర్శకుడు రవిబాబు
- ఫ్యామిలీ థ్రిల్లర్ గా రూపొందిన 'ఆవిరి'
- కీలకమైన పాత్రలో రవిబాబు
- వచ్చేనెల 1వ తేదీన విడుదల
ఈ సినిమాలో కీలకమైన పాత్ర నేనే చేయాలని ముందుగా అనుకోలేదు. వేరే ఎవరినైనా తీసుకుందామని ట్రై చేసినా కుదరలేదు. 'ఈ పాత్రను నువ్వు చేస్తేనే బాగుంటుందేమో' అని రైటర్ సత్యానంద్ గారు అంటే, అప్పుడు ఆ పాత్రను చేశాను. దిల్ రాజుగారితో మంచి పరిచయం వుంది. కలిసి సినిమా చేద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంతవరకూ కుదరలేదు. ఈ సినిమాను ఆయన రిలీజ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.