దర్శకుడిపై ఫిర్యాదు చేసిన హీరోయిన్ మంజు వారియర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకుడిపై ఫిర్యాదు చేసిన హీరోయిన్ మంజు వారియర్!

  • దిలీప్ తో విడాకుల తరువాత శ్రీ కుమార్ తో స్నేహం
  • ఇటీవలి కాలంలో ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు
  • పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు
మలయాళ దర్శకుడు శ్రీ కుమార్ మీనన్ పై హీరోయిన్ మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. శ్రీ కుమార్ పై కేసు నమోదైన విషయాన్ని కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరా వెల్లడించారు. త్రిసూర్ ఈస్ట్ పోలీసు స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 509తో పాటు పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టరైందని, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారని అన్నారు.

కాగా, నటుడు దిలీప్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం మంజు వారియర్ కెరీర్ నెమ్మదించగా, ఆమె శ్రీ కుమార్ కు దగ్గరైంది. పలు షార్ట్ ఫిల్మ్ లతో పాటు, వివిధ కంపెనీల్లో అడ్వర్టయిజ్ మెంట్లను తీసిన శ్రీ కుమార్, వాటితో మంజు వారియర్ కు బ్రేక్ ఇచ్చాడు. హిట్ చిత్రం 'ఓడియన్'లో కీలక పాత్రను కూడా ఇచ్చాడు. ఇద్దరూ వివిధ సినిమాలకు కలిసి పనిచేశారు కూడా. ఇటీవలి కాలంలో వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంజు, శ్రీ కుమార్ పై ఫిర్యాదు చేసింది.
Kerala
Manju Warrior
Sri Kumar
Police
Case

More Telugu News