తొలి 'రాఫెల్' కు టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి దిష్టి తీసిన రాజ్ నాథ్ సింగ్
- 'రాఫెల్' ను అప్పగించిన ఫ్రాన్స్
- స్వీకరించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్
- విమానానికి ఆయుధపూజ
ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వద్ద ఉన్న డసాల్ట్ ఏవియేషన్ సంస్థకు చెందిన రాఫెల్ తయారీ యూనిట్ లో ఈ అప్పగింతల కార్యక్రమం జరిగింది. ఒప్పందం ప్రకారం భారత్ కు డసాల్ట్ ఏవియేషన్ సంస్థ 36 రాఫెల్ యుద్ధ విమానాలను అందించాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్ నాథ్ అందుకున్నది తొలి విమానం. దీనికున్న అద్భుత పోరాట సామర్థ్యాల దృష్ట్యా భారత్ అగ్రరాజ్యాలకు దీటుగా వాయుశక్తిని సముపార్జించుకున్నట్టయింది.
