దొరికిన మృతదేహం శ్రీహర్షదేనని ఇంకా తేల్చని లండన్ పోలీసులు!
- గత నెల 21న అదృశ్యం
- నిన్న మృతదేహం లభ్యమైనట్టు వార్తలు
- డీఎన్ఏ టెస్ట్ కు పంపిన పోలీసులు
శ్రీహర్ష మృతిపై లండన్ పోలీసులు నిర్ధారణ చేయలేదని, ఓ మృతదేహం మాత్రం దొరికిందని, దానికి కాస్తంత దూరంలో తన కుమారుడి పర్సు లభించిందని, ఈ కారణంగా అది శ్రీహర్ష మృతదేహమని చెప్పలేమని అక్కడి అధికారులు తనకు సమాచారం ఇచ్చారని అన్నారు. మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపించారని చెప్పారు. శ్రీహర్ష ఆచూకీ కోసం బ్రిటన్ లోని తెలుగువారు ఎంతో సాయం చేస్తున్నారని చెప్పారు. పోలీసులకు లభ్యమైన మృతదేహానికి డీఎన్ఏ టెస్ట్ పూర్తయితేనే విషయం తెలుస్తుందని అన్నారు.