వాట్సాప్ పేరు మార్పు... ఇక నుంచి 'వాట్సాప్ బై ఫేస్ బుక్'!
- ప్రస్తుతం బీటా వెర్షన్ వినియోగదారులకు కనిపిస్తున్న 'వాట్సాప్ బై ఫేస్ బుక్'
- 2014లో వాట్సాప్ ను కొనుగోలు చేసిన ఫేస్ బుక్
- ఇన్ స్టాగ్రామ్ పేరు కూడా మార్చనున్న సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం
వాట్సాప్ ను ఐదేళ్ల కిందట ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఈ యాప్ లో అనేక మార్పులు చేస్తూ వస్తోంది. తాజాగా తన పేరు జత చేసి వాట్సాప్ బై ఫేస్ బుక్ గా నామకరణం చేసింది. 2012లోనే ఇన్ స్టాగ్రామ్ ను కొనుగోలు చేసిన ఫేస్ బుక్ ఆ ఫొటో బేస్డ్ యాప్ కు కూడా తన పేరు జత చేస్తున్నట్టు తెలుస్తోంది.