వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి పేమెంట్ ఆప్షన్!
- యాప్ బీటా వర్షన్‌ను పరీక్షిస్తోన్న ఫేస్బుక్
- నగదు బదిలీని మరింత సులభతరం చేయడమే లక్ష్యం
- వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్న వాట్సాప్
ఆర్బీఐ నుంచి అనుమతులు రావడమే తరువాయి, వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. ముందుగా భారత్‌లోని పది లక్షల యూజర్లతో ఈ యాప్ బీటా వర్షన్‌ను ఫేస్బుక్ పరీక్షిస్తోంది. ఈ సందర్భంగా విల్ కాథ్‌కార్ట్ మాట్లాడుతూ, నగదు బదిలీని డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా మరింత సులభతరం చేయడమే లక్ష్యమన్నారు. దీనికోసం దేశంలోని వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఒకసారి ఈ యాప్ అందుబాటులోకి వస్తే దేశంలో డిజిటల్ ఎకానమీ అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. దాదాపు ఈ ఏడాది చివరికి, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో ఈ ఫీచర్ ను వాట్సాప్ లో అందుబాటులోకి తెస్తామని విల్ కాథ్‌కార్ట్ తెలిపారు.