గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబు వాహనం నిలిపివేత.. ప్రయాణికుల బస్సులో వెళ్లిన టీడీపీ అధినేత
- విపక్షనేతకు చేదు అనుభవం
- గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు తనిఖీలు
- ప్రత్యేక వాహనం కేటాయించని అధికారులు
తన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంతో ఎయిర్ పోర్టులో ప్రవేశించడానికి చంద్రబాబు ప్రయాణికుల బస్సులో వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఓ వీఐపీ అయినా, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా విమానాశ్రయ అధికారులు ప్రత్యేక వాహనాన్ని కేటాయించలేదు. అయితే చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ఎంతో హుందాగా వ్యవహరించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.