సత్తెనపల్లిలో బెట్టింగ్ ముఠా అరెస్టు.. కీలక నిందితుడు ఎంబీఏ విద్యార్థి!
- నలుగురు సభ్యుల క్రికెట్ బెట్టింగ్ ముఠా
- నిందితుల నుంచి రూ.22.16 లక్షలు స్వాధీనం
- పోలీసుల అదుపులో బెట్టింగ్ కు పాల్పడ్డ నిందితులు
పట్టుబడ్డ విద్యార్థుల్లో ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన వారు కూడా ఉన్నట్టు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఈ ముఠాలో కీలక నిందితుడు పసుపులేటి నాగార్జున అని, అతను ఎంబీఏ చదువుతున్నాడని చెప్పారు. ఈ ముఠా సభ్యులైన అవదీశ్ ప్రతాప్ సింగ్, అంకిత్ ద్వివేది, దివ్యాంషు సింగ్ లను అరెస్టు చేశామని అన్నారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన నాగార్జున, అందులో 226 మందిని చేర్చుకున్నట్టు వివరించారు.