చంద్రబాబు అవన్నీ ఈసీ అనుమతి తీసుకునే చేస్తున్నారా?: ఈసీకి విజయసాయి లేఖ
- ప్రజా వేదికను పార్టీ అవసరాల కోసం వినియోగిస్తున్నారు
- టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను వాడుతున్నారు
- ఎన్నికల కోడ్ సక్రమంగా అమలయ్యేలా చూడండి
ప్రభుత్వ అతిథి భవనాలు, మీటింగ్ హాల్‌లు ఇతర సదుపాయాలను మిగిలిన పార్టీలు కూడా వినియోగించుకునేందుకు సమాన అవకాశం కల్పించాలని విజయసాయి కోరారు. అసలు ఈ సదుపాయాలన్నింటినీ వాడుకునేందుకు చంద్రబాబు ఈసీ అనుమతి తీసుకున్నారో, లేదో కూడా తమకు తెలియపరచాలని కోరారు. ఈ సంఘటనలపై సమీక్షించి ఎన్నికల కోడ్ సక్రమంగా అమలయ్యేలా స్పష్టమైన ఆదేశాలివ్వాలని విజయసాయి ఈసీని కోరారు.