ఏపీలో 800 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి: సురవరం
- మహిళలు తమ ఓటు వేయకుండానే వెనుదిరిగారు
- ఈవీఎంలపై ఉన్న సందేహాలను తొలగించాలి
- ఆ బాధ్యత ఎన్నికల సంఘానిదే
గతంలో ఈవీఎంలు, వీవీప్యాట్స్ లో ఓట్ల తేడాను గమనించామని, అందుకే, ఈవీఎంలపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చిందని అన్నారు. ఈవీఎంలపై ఉన్న సందేహాలను తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని చెప్పారు. ఓట్ల లెక్కింపులో వీవీప్యాట్స్ సంఖ్యను పెంచాల్సిదిగా డిమాండ్ చేస్తున్నామని, మరో మార్గం లేదని, లేకపోతే బ్యాలెట్ పద్ధతినే అనుసరించాలని డిమాండ్ చేశారు.