పుట్టా ఇంట్లో ముగిసిన ఐటీ రైడ్స్.. అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రమేష్!
- ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది?
- ఎవరు పంపించారు?
- ఏం దొరికిందో చెప్పండి?
‘పుట్టా ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ఎవరు పంపించారు? అంతా వెదికారు కదా, ఏం దొరికిందో చెప్పండి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధికారులు మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే పుట్టా ఇంటిపై ఐటీ రైడ్స్ విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకుని అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. జగన్, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.