జగన్‌కు తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటే: ఆదినారాయణరెడ్డి
- మరణవార్త తెలియగానే వివేకా ఇంటికెళ్లా
- త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయి
- రాజకీయలబ్ధి కోసం ఆరోపణలు సరికాదు
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకా మృతి విషయంలో త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని, అవి తెలియకముందే రాజకీయ లబ్ధి కోసం రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్‌కు కూడా తప్పుడు ఆరోపణలు చేయడం అలవాటేనన్నారు. తప్పు చేసిన వారిని ఉరి తీసినా తప్పులేదని.. వివేకా మృతిపై లోతైన దర్యాప్తు జరపాలన్నారు.