జగన్ కు మంచీ లేదు, మానవత్వం లేదు... చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన వెంటే: గంటా
- అనుమానాలు పటాపంచలు చేసిన ఏపీ మంత్రి
- వైసీపీపై మండిపాటు
- విలువల్లేని రాజకీయాలు చేస్తోందంటూ విమర్శలు
అంతకుముందు, మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. 'అజ్ఞాతంలో గంటా', 'చంద్రబాబుపై గంటా అలక' అంటూ బ్రేకింగ్ న్యూస్ కూడా ఓ చానల్ లో దర్శనమిచ్చింది. అయితే, అదే సమయంలో ఏపీ మంత్రి నారా లోకేష్... గంటాతో ఓ సెల్ఫీ దిగి ఆ చానల్ కు ఝలక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గంటా వివరణ ఇచ్చినట్టు అర్థమవుతోంది.