నేను ఎంపీగా పోటీ చేస్తానంటే వారు ఒప్పుకోవడం లేదు: చంద్రబాబుతో శిద్దా
- ఎంపీగా పోటీ చేయమని కోరిన చంద్రబాబు
- కార్యకర్తలు ఒప్పుకోవడం లేదన్న శిద్దా
- నేడు మరోమారు చంద్రబాబుతో భేటీ
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఎంపీగా బరిలోకి దిగుతానంటే నియోజకవర్గ కార్యకర్తలు అంగీకరించడం లేదని తెలిపారు. ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని పట్టుబడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే బుధవారం (నేడు) మరోమారు మాట్లాడదామని చెప్పారన్నారు. తప్పని పరిస్థితుల్లో ఒకవేళ ఎంపీగానే పోటీ చేయాల్సి వస్తే కుటుంబ సభ్యుల అభిప్రాయం కూడా తీసుకుంటానని తెలిపారు.