దమ్ముంటే చంద్రబాబు భీమిలి నుంచి పోటీచేయాలి.. ఎవరొచ్చినా సీటు మాదే!: అవంతి శ్రీనివాస్
- ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
- టీడీపీ హయాంలో ఓ వర్గానికే లాభం జరిగింది
- హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత
ఏపీ ప్రజలు 3 సార్లు అవకాశమిచ్చినా చంద్రబాబు మాత్రం తాను అయోమయానికి గురవుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అవంతి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ హయాంలో ఓ సామాజికవర్గానికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలతో ప్రజలు విసిగిపోయారన్నారు.
2014 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ను తిట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పుడు బీజేపీని తిడుతూ కాంగ్రెస్ తో జతకడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మొదటినుంచి వైసీపీనే పోరాడుతోందని గుర్తుచేశారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.