‘డేటా కుంభకోణం’పై విచారణ చేస్తే పిల్లకాకి లోకేశ్ కు భయమెందుకు!: వైసీపీ నేత బొత్స
- సూత్రధారులు బయటపడతారనే భయపడుతున్నారు
- ఏ తప్పూ చేయకుంటే విచారణను ఎదుర్కోండి
- టీడీపీ అధినేత, లోకేశ్ పై విమర్శలు గుప్పించిన నేత
ఈరోజు ట్విట్టర్ లో బొత్స స్పందిస్తూ..‘డేటా దొంగతనం స్కాం పై విచారణ చేస్తే.. పిల్లకాకి @naralokesh కి అంత భయమెందుకో? అసలు సూత్రధారుల బాగోతం బయటపడుతుందనా? ఏ తప్పూ చేయనప్పుడు విచారణను ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా? దొంగతనం చేసి పచ్చిగా పట్టుబడింది కాక దొంగే "దొంగా.. దొంగా" అంటూ తండ్రీకొడుకులు భుజాలు తడుముకుంటున్నారు?’ అని ట్వీట్ చేశారు.