రాజ రాజ చోళుడి కథతో క్రిష్ వెబ్ సిరీస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ రాజ చోళుడి కథతో క్రిష్ వెబ్ సిరీస్

  • దర్శకుడిగా క్రిష్ ఫుల్ బిజీ 
  • నిర్మాతగాను చురుకైన పాత్ర 
  • తమిళ వెబ్ సిరీస్ కి సన్నాహాలు    
చారిత్రక నేపథ్యం కలిగిన 'మణికర్ణిక' హిందీ సినిమాకి దర్శకత్వం వహించిన క్రిష్, ఆ వెంటనే ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన పనులను భుజాన వేసుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే 'కథానాయకుడు' షూటింగును పూర్తి చేసిన ఆయన, అంతే వేగంగా 'మహానాయకుడు' చిత్రీకరణ కొనసాగిస్తున్నారు. ఇలా ఒక వైపున దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున చిన్న సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.

 తాజాగా ఆయన ఒక నిర్మాతగా వెబ్ సిరీస్ లపై కూడా దృష్టిపెట్టారు. వెబ్ సిరీస్ కి కూడా ఆయన చారిత్రక కథావస్తువునే ఎంచుకోవడం విశేషం. 'రాజ రాజ చోళుడు' జీవిత చరిత్రను తమిళంలో వెబ్ సిరీస్ గా నిర్మించడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేశారు. క్రిష్ సూపర్ విజన్ లో ఈ వెబ్ సిరీస్ కి సురేశ్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. గతంలో 'ప్రేమ'.. 'ఇంద్రుడు చంద్రుడు' .. 'బాషా' .. 'మాస్టర్' వంటి హిట్స్ సురేశ్ కృష్ణ ఖాతాలో వున్నాయి. ఆరు భాగాలుగా రానున్న ఈ తమిళ వెబ్ సిరీస్ .. తెలుగులోను అనువాదం కానుంది. 
krish
suresh krishna

More Telugu News