చంద్రబాబు కీలక నిర్ణయం... హర్షం వ్యక్తం చేస్తున్న భాష, వ్యాయామ ఉద్యోగులు!
- భాష, వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు
- జీవో విడుదల చేసిన ఏపీ సర్కారు
- మంత్రి గంటాను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
తమ విజ్ఞప్తిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించడం ఎంతో సంతోషకరమని అన్నారు. కొత్త జీవో వల్ల 10,827 మంది లబ్ధి పొందనున్నారని తెలిపారు. ఆపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు టైమ్ స్కేలు అమలు చేయాలని, దీనిని క్యాబినెట్ లో ఆమోదించాలని ఆయన కోరారు. మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వీరి వినతులన్నీ పరిశీలిస్తామని గంటా హామీ ఇచ్చారు.