వాట్సాప్‌లో న్యూడ్ వీడియో కాల్.. కట్ చేస్తే రూ.49 లక్షలు మాయం!
- అహ్మదాబాద్ యువకుడికి వాట్సాప్‌లో యువతి న్యూడ్ వీడియో కాల్
- ‘న్యూడ్ వీడియో’ పేరుతో సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
- పోలీస్ అధికారి పేరుతోనూ మోసం
- యూట్యూబ్ ప్రతినిధిగా మరో నిందితుడి నటన
- వీడియోలు తొలగిస్తామంటూ మొదట రూ.71,250 డిమాండ్
- విడతలుగా మొత్తం రూ.49.78 లక్షలు వసూలు
అవతలి వ్యక్తి ఎవరో తెలియదు.. కానీ వీడియో కాల్ ఎత్తగానే స్క్రీన్‌పై ఓ యువతి నగ్నంగా కనిపించింది. షాక్‌కు గురైన యువకుడు వెంటనే కాల్ కట్ చేసి నంబర్‌ను బ్లాక్ చేశాడు. ఇంతలో మరో నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘‘నీ నగ్న వీడియో మా దగ్గర ఉంది.. వైరల్ చేస్తాం’’ అంటూ బెదిరింపులు మొదలయ్యాయి. చివరకు ఈ భయాన్ని అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు అతడి నుంచి ఏకంగా రూ.49.78 లక్షలు కాజేశారు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 25 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి సెప్టెంబర్ 3న గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ ఎత్తగానే నగ్నంగా ఉన్న ఓ యువతి స్క్రీన్‌పై కనిపించింది. దీంతో అతడు వెంటనే కాల్ కట్ చేసి నంబర్‌ను బ్లాక్ చేశాడు.
కొద్దిసేపటికే మరో నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘‘నీ న్యూడ్ వీడియో రికార్డ్ చేశాం. డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం’’ అంటూ అవతలి వ్యక్తులు బెదిరించారు. ఈ క్రమంలో ఓ వీడియోను కూడా పంపారు. భయపడిన యువకుడు దాన్ని తర్వాత డిలీట్ చేశాడు.
అక్కడితో ఆగని మోసగాళ్లు సెప్టెంబర్ 27న మరో నంబర్ నుంచి సంప్రదించారు. తాను ఢిల్లీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి సంజయ్ అరోరానని ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. న్యూడ్ వీడియో కేసులో నేరం జరిగిందని.. దీనికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పి యువకుడిని మరింత భయపెట్టాడు. అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ హెచ్చరించాడు.
అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే యూట్యూబ్ ప్రతినిధితో మాట్లాడి ‘డ్యూ ప్రాసెస్’ పూర్తి చేయాలని చెప్పాడు. అనంతరం మరో వ్యక్తిని యూట్యూబ్ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేశాడు. తన పేరుతో రెండు న్యూడ్ వీడియోలు బయటకు వచ్చాయని.. వాటిని తొలగించాలంటే రూ.71,250 చెల్లించాలని అతడు చెప్పాడు.
పోలీసులకు భయపడటం.. వీడియోలు బయటకు వస్తే పరువు, ఉద్యోగం పోతుందేమోనన్న ఆందోళనతో యువకుడు డబ్బులు చెల్లించాడు. అయితే ఆ తర్వాత అసలు మోసం మొదలైంది. ఒక్కోసారి ఒక్కో కారణం చెబుతూ నిందితులు మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. వీడియో వైరల్ చేస్తామని.. కెరీర్ నాశనం చేస్తామని బెదిరింపులు కొనసాగించారు. అరెస్ట్ చేస్తామంటూ కూడా భయపెట్టారు.
అలా నిందితులు అడిగిన ప్రతిసారీ యువకుడు డబ్బులు పంపుతూ వచ్చాడు. వివిధ సందర్భాల్లో వారు సూచించిన బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.49.78 లక్షలు బదిలీ చేశాడు. అయినా వారి డిమాండ్లు ఆగలేదు. మరింత డబ్బు కావాలంటూ మళ్లీ ఒత్తిడి చేశారు.
చివరకు తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన యువకుడు సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. డబ్బులు బదిలీ చేసిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఈ మోసం వెనుక ఎంతమంది ఉన్నారన్న దానిపైనా దర్యాప్తు చేస్తున్నారు.