తెలుగు సినిమా ఒక్కటే.. తెలంగాణ, ఆంధ్ర అని విడగొట్టొద్దు: నరేశ్
- సినిమాలపై ప్రాంతీయ ముద్ర వేయడం ఫ్యాషన్‌గా మారిందని నరేశ్ విమర్శ
- 'గరివిడి లక్ష్మి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు
- మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించాలని ప్రేక్షకులకు పిలుపు
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలను ప్రాంతాల వారీగా విభజించడం సరికాదని, ఉన్నది ఒకే ఒక్క తెలుగు సినిమా అని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. ఇటీవల తెలంగాణ సినిమా, రాయలసీమ సినిమా, ఉత్తరాంధ్ర సినిమా అంటూ ముద్రలు వేయడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన 'గరివిడి లక్ష్మి' బయోపిక్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. "పాటలకు, సంగీతానికి ఎలాగైతే సరిహద్దులు ఉండవో, సినిమాకు కూడా ఎలాంటి ప్రాంతీయ భేదాలు ఉండవు. ప్రేక్షకులు కొరియన్, మలయాళం, తమిళ సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నప్పుడు, మన సినిమాలను మనం ఎందుకు ప్రాంతాల వారీగా విడదీస్తున్నాం?" అని ప్రశ్నించారు. తమిళంలో వచ్చిన 'మణ్ వాసనై' (మట్టి వాసన) సినిమాను ఉదాహరిస్తూ... మట్టి వాసనకు ప్రాంతంతో సంబంధం లేదని, అది అందరినీ కలుపుతుందని అన్నారు. 'గరివిడి లక్ష్మి' కథ కూడా ప్రతి తెలుగు ప్రేక్షకుడిని కదిలిస్తుందని తెలిపారు.
ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై నరేశ్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. "ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించే మొదటి చిత్రం 'గరివిడి లక్ష్మి' అవుతుంది. ఇది 'మహానటి'లా వినోదం, భావోద్వేగాలు కలగలిపిన బయోపిక్. ఈ చిత్రానికి జాతీయ అవార్డులు కూడా వస్తాయని ఆశిస్తున్నా" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.