కేసీఆర్ ఓ నల్లతాచు.. లగడపాటి రాజగోపాల్ చెప్పింది జరిగి తీరుతుంది!: రేవంత్ రెడ్డి
- మహాకూటమి విజయం తథ్యం
- రైతులెవరూ బ్యాంకులకు అప్పులు కట్టొద్దు
- కాంగ్రెస్ నేతల హయాంలో పందులు మాత్రమే పెరిగాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లత్రాచులాంటి వ్యక్తి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి ఓ ఉగ్రవాదిలా పోలీసులు తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కొడంగల్ ప్రజలు 9 సంవత్సరాల క్రితం నాటిన మొక్క తానని వ్యాఖ్యానించారు. తనను నరకడానికి సిద్ధిపేట నుంచి ఒకరు, షాబాద్ నుంచి ఇంకొకరు గొడ్డళ్లు తీసుకుని బయలుదేరారని విమర్శించారు.
తనను కొడంగల్ ప్రజలు ఆశీర్వదించడంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల దెబ్బకు ప్రతీ ఊర్లో ఇప్పుడు పందులు కనిపిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు 100 అడుగుల గోతిలో పాతిపెట్టే రోజులు వచ్చాయన్నారు.