మహాకూటమి జాబితా అమరావతిలో తయారవుతోంది.. హుజూర్ నగర్ నుంచి నేను పోటీ చేస్తున్నా!: చెరకు సుధాకర్
- ఉద్యమకారులకు మళ్లీ అన్యాయం
- ఈ జాప్యానికి కోదండరాం, ఉత్తమ్ లే కారణం
- సామాజిక న్యాయాన్ని పట్టించుకోలేదు
మహాకూటమి అభ్యర్థుల జాబితా ఇప్పుడు అమరావతిలో తయారవుతోందని సుధాకర్ విమర్శించారు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్-టీడీపీలు సామాజిక న్యాయాన్ని గాలికి వదిలేశాయని ఆరోపించారు. టీజేఎస్ చీఫ్ కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణంగానే సీట్ల కేటాయింపులో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఏదేమైనా తాను హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.