కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్ విడుదల!
- కేసీఆర్ గా నటిస్తున్న నాజర్
- ఈ నెల 16న పాటల విడుదల
- దర్శకత్వం వహించిన అల్లూరి కృష్ణంరాజు
ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ నటిస్తున్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తయిందనీ, ఈ నెల 16న సినిమా పాటలను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘ఉద్యమ సింహం’ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నారు.