సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్న సమంత.. రాజ్‌ నిడిమోరు ఆపింది ఇలానే!

సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్న సమంత.. రాజ్‌ నిడిమోరు ఆపింది ఇలానే!

Samantha wanted to say goodbye to films but Raj Nidimoru stopped her like this
  • మయోసైటిస్‌తో ఏడాది పాటు సినిమాలకు దూరమైన సమంత
  • వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన స్టార్‌ హీరోయిన్‌
  • ‘మా ఇంటి బంగారం’తో నిర్మాణ రంగంలోకి అడుగు
  • కెరీర్‌ కొనసాగించాలని రాజ్‌ నిడిమోరు ప్రోత్సాహం
  • సెట్‌లో రాజ్‌ ఉండటం ధైర్యమిచ్చిందని సమంత వెల్లడి
సినీ కెరీర్‌కు దాదాపు ముగింపు పలకాలని ఓ దశలో స్టార్‌ హీరోయిన్‌ సమంత భావించారట. అనారోగ్య సమస్యలతో ఏడాది పాటు విరామం తీసుకున్న ఆమె.. ఇక నటనకు దూరంగా ఉండాలని అనుకుంది. అయితే ఆమె భర్త, దర్శకుడు రాజ్‌ నిడిమోరు మాత్రం అందుకు అంగీకరించలేదు. తనపై ఆయన పెట్టుకున్న నమ్మకమే మళ్లీ కెమెరా ముందుకు వచ్చే ధైర్యాన్ని ఇచ్చిందని సమంత తాజాగా వెల్లడించింది.

ఓ ఇంటర్వ్యూలో సమంత తన జీవితంలోని ఆ దశను గుర్తు చేసుకుంది. ఏడాది పాటు విరామం తీసుకున్న తర్వాత ఇతర పనులు చేయాలని అనిపించిందని చెప్పింది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న సూచనను సీరియస్‌గా తీసుకున్నానని తెలిపింది. తనకు నచ్చిన పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టానని, అలా ‘సీరియల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా మారానని చెప్పింది.

అదే సమయంలో ‘సిటాడెల్‌’ షూటింగ్‌ చేయాల్సి వచ్చింది. అనారోగ్యంతో షూటింగ్‌ చేయడం తనకు అంత సౌకర్యంగా అనిపించలేదని సమంత చెప్పింది. తన కోసం చిత్రబృందం ఎదురుచూడటం, వారి సమయం వృథా కావడం ఇష్టం లేకపోయిందని పేర్కొంది. దీంతో నటనకు బదులుగా ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

అయితే రాజ్‌ నిడిమోరు ఆమె నిర్ణయాన్ని మార్చేశాడు. ‘‘ఆయనకు నాపై నాకంటే ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. సెట్‌లో ఆయన ఉండటం నాకు ధైర్యం ఇచ్చింది’’ అని సమంత చెప్పింది. తాను దాదాపు కెరీర్‌ వదిలేయాలని నిర్ణయించుకున్నానని, ‘సిటాడెల్‌’ బృందానికి ఈ విషయంపై మెయిల్‌ కూడా పంపానని వెల్లడించింది.

‘మా ఇంటి బంగారం’లో తొలుత సాయిపల్లవిని అనుకున్నారట. ఆమె నటించేందుకు నిరాకరించడంతో సమంత ఆ ప్రాజెక్టులోకి వచ్చింది. కథలో మంచి సామర్థ్యం ఉందని భావించి అది తెరపైకి రావాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపింది.

సమంతకు 2022లో మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూన్‌ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె తన ఆరోగ్య పరిస్థితిపై పలు సందర్భాల్లో మాట్లాడింది. ప్రస్తుతం మళ్లీ వరుస ప్రాజెక్టులతో ఆమె సినిమాల్లో యాక్టివ్‌గా మారింది.
Advertisement
Samantha
Raj Nidimoru
Citadel Honey Bunny
Samantha Myositis
Maa Inti Bangaram
Samantha acting career

More Telugu News