వరంగల్ లో ఈసీ కలకలం.. కాంగ్రెస్ ఆఫీసు తాళాలు పగులగొట్టి తనిఖీలు!
- పార్టీ నేతలకు సమాచారమివ్వని అధికారులు
- ఆందోళనకు దిగి, ర్యాలీ నిర్వహించిన నేతలు
- ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారి సతీశ్ నిర్బంధం
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. అధికార పార్టీ కుట్రలో భాగంగానే ఈ దాడి చోటుచేసుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రతీకార చర్యలు సరికాదని హెచ్చరించారు. అధికార టీఆర్ఎస్ నేతలే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.