ఎలా ప్రొసీడ్ కావాలి?.. చంద్రబాబు అరెస్ట్ వారెంట్ పై తర్జనభర్జన పడుతున్న మహారాష్ట్ర పోలీసులు!
- ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేయాలని యోచిస్తున్న నాందేడ్ పోలీసులు
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే యోచనలో మహా పోలీసులు
- మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూస్తున్న వైనం
కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన వారిలో తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. కొందరు ప్రస్తుతం టీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా తీసుకోవాలని నాందేడ్ పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాకే... ముందుకు సాగాలనే యోచనలో కూడా వారు ఉన్నట్టు సమాచారం. మరోవైపు కోర్టు ముందుకు చంద్రబాబు హాజరవుతారా? లేక హైకోర్టుకు వెళతారా? అనే విషయంలో కూడా సస్పెన్స్ నెలకొంది.