దేశభక్తిని ప్రదర్శించడం కూడా నేరమేనా?: మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

  • రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయం
  • తిరంగ యాత్ర నిర్వహించానని వేధిస్తున్నారు
  • ఐదు పోలీస్‌ స్టేషన్లలో కేసులని ఆవేదన
దేశభక్తిని ప్రదర్శించడం కూడా నేరమా? తిరంగ యాత్ర నిర్వహించానని నాపై ఐదు పోలీస్‌ స్టేషన్లలో కేసు నమోదు చేసి వేధించడం అన్యాయం అని బీజేపీ గోషామహల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎంఐఎం ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఆగస్టు 15వ తేదీన అనుమతి లేకుండా జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించానని అబిడ్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని రాజాసింగ్‌ ప్రస్తావించారు. అయితే, ఇటువంటి బెదిరింపులకు లొంగేది లేదని, దీన్ని కోర్టులోనే తేల్చుకుంటానని రాజాసింగ్‌ స్పష్టం చేశారు.
Go Back to Shorts
rajasingh
BJP
Hyderabad

More Telugu News