కేసీఆర్ అన్నం పెట్టిన దేవుడు.. ఈ ఎన్నికల్లో చెన్నూరు టికెట్ నాదే!: నల్లాల ఓదేలు
- నా శ్రమను కేసీఆర్ గుర్తించారు
- నామినేషన్ కు కూడా ఆయనే డబ్బులిచ్చారు
- కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యం
2010 లో పదవులకు రాజీనామా చేయాలని కేసీఆర్ కోరితే వెంటనే చేశామనీ, అప్పట్లో ‘మీ కోసం బావిలో దూకమన్నా దూకుతాను’ అని కేసీఆర్ కు చెప్పానని ఓదేలు తెలిపారు. ఇప్పటికి రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీ టికెట్ పై, కేసీఆర్ సాయంతోనే గెలిచానని ఆయన చెప్పారు. ఈసారి కూడా పార్టీ తనకే టికెట్ ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ రావాలంటే కేసీఆర్ సీఎం కావాలని ఓదేలు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంచితే, చెన్నూరు అసెంబ్లీ టికెట్టును ఇప్పటికే బాల్క సుమన్ కు పార్టీ అధిష్ఠానం ప్రకటించిన సంగతి విదితమే!