కేరళ రిలీఫ్ క్యాంపులో కూలీలా పనిచేస్తున్న ఫుట్‌బాల్ స్టార్.. దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్న వినీత్!
- బాధితుల సేవలో తరిస్తున్న వినీత్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
- లక్షలాదిమంది హృదయాలను గెలుకున్న స్టార్ ఆటగాడు
కేరళ బ్లాస్టర్స్ తరపున ఆడుతున్న వినీత్ ఎదిగి ఉన్నా ఒదిగి ఉండాలన్న మనస్తత్వం కలవాడు. కేరళ యువకులకు రోల్ మోడల్ అయిన వినీత్ రిలీఫ్ క్యాంపులో కూలీలా పనిచేస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన అభిమాని ఒకరు ‘డార్లింగ్ ఆఫ్ మిలియన్’ అని కామెంట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కేరళకు వినీత్ లాంటి వారు మరింతమంది అవసరమని చెబుతున్నారు. బాధితుల బాధను పంచుకోవడంలో ముందున్న వినీత్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడని కితాబిస్తున్నారు.