రెమ్యునరేషన్ చెల్లించలేదని చెప్పడం అవాస్తవం: 'భరత్ అనే నేను' నిర్మాత దానయ్య
- కొరటాల శివ, కైరా అద్వానీలకు డబ్బు చెల్లించలేదనే వార్తలు
- ఆ వార్తలు అవాస్తవాలన్న దానయ్య
- తమ ఆఫీస్ కు వచ్చి చెక్ చేసుకోవచ్చన్న నిర్మాత
దీనిపై దానయ్య స్పందిస్తూ, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని చెప్పారు. ఈ చిత్రం కోసం పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లందరికీ పారితోషికాలు చెల్లించామని తెలిపారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే హైదరాబాదులో ఉన్న తమ కార్యాలయానికి వచ్చి చెక్ చేసుకోవచ్చని, లేదా తమ సినిమాలో పని చేసిన నటీనటులను అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ప్రసారం చేయవద్దని జర్నలిస్టులను కోరుతున్నానని తెలిపారు.