బీజేపీ, వైసీపీలు 'క్విడ్ ప్రోకో'కు కేరాఫ్ అడ్రస్: రాయపాటి సాంబశివరావు

  • గాలి కోసం జగన్ తన సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచారు
  • బీజేపీ, వైసీపీ జెండాలు వేరైనా వాటి అజెండా ఒకటే
  • విభజన హామీలపై బీజేపీ నేతలు ప్రజల మధ్య మాట్లాడాలి
బీజేపీ, వైసీపీలు క్విడ్ ప్రో కో కు కేరాఫ్ అడ్రస్ గా మారాయని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్న గాలి జనార్దన్ రెడ్డి కోసం తమ్ముడు జగన్ తన సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచారని, బీజేపీ, వైసీపీ జెండాలు వేరైనా వాటి అజెండా ఒకటేనని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కడప స్టీల్ ప్లాంట్ ను బహుమానంగా ఇచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని, విభజన హామీలపై బీజేపీ నేతలు ప్రజల మధ్య మాట్లాడాలని అన్నారు.

కాగా, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రమంతా ఆందోళన చెందుతోందని అన్నారు. ఈ విషయమై వైసీపీ కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డితో కలిసి వైసీపీ, బీజేపీ లు స్టీల్ ఫ్యాక్టరీ రాకుండా చేస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా డొక్కా విమర్శలు చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయమై ట్వీట్లు చేయడం కాదని, వాస్తవాలు తెలుసుకుని పవన్ మాట్లాడాలని సూచించారు.
Go Back to Shorts
bjp
YSRCP
rayapati

More Telugu News