శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా ప్రారంభం .. టైటిల్ ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా ప్రారంభం .. టైటిల్ ఖరారు

  • శ్రీవిష్ణు హీరోగా 'తిప్పరా మీసం'
  • దర్శకుడిగా కృష్ణ విజయ్ 
  • త్వరలో మిగతా వివరాలు    
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలను చేస్తూ శ్రీవిష్ణు తన సత్తా చాటుకుంటున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' .. 'నీదీ నాదీ ఒకే కథ' సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన, దర్శకుడు కృష్ణ విజయ్ చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'అసుర' సినిమాతో కృష్ణవిజయ్ మంచి మార్కులు తెచ్చుకోవడం కూడా శ్రీవిష్ణు ఓకే చెప్పడానికి ఒక కారణమని చెప్పాలి.

ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో శ్రీ విష్ణు .. కృష్ణ విజయ్ ల కాంబినేషన్లోని సినిమాను ఈ రోజు ఉదయం లాంచ్ చేశారు. తెలంగాణ సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. నారా రోహిత్ తొలి క్లాప్ ఇచ్చాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ .. ఓం శ్రీ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'తిప్పరా మీసం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.  
sri vishnu

More Telugu News