అల్లు శిరీశ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
- అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
- మలయాళ మూవీకి రీమేక్
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
అల్లు శిరీశ్ .. కథానాయిక రుక్షార్ పై నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా .. నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సినిమా టీమ్ కి ఈ నిర్మాతలిద్దరూ శుభాకాంక్షలు అందజేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.