బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు... నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
- తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫేస్‌బుక్ పోస్టు
- అన్నీ కాపీ చేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన
- ఆ భగవంతుడు చూస్తున్నాడని హెచ్చరిక
‘కాన్సెప్ట్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి బట్టలు మార్చుకున్నట్లు మనుషులను మారుస్తూ మాట మీద ఉండకపోవడం, జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ వేష భాషలు మారుస్తూ.. జనాలను మభ్యపెట్టి అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు. ఆ భగవంతుడే నిజం ఏంటో తెలిసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది.