అమెరికా డ్రోన్ దాడుల్లో పాకిస్థాన్ తాలిబన్ చీఫ్ కుమారుడు హతం
- పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దులో అమెరికా డ్రోన్ దాడులు
- 20 మంది ఆత్మాహుతి సభ్యులు హతం
- మృతుల్లో టీటీపీ కమాండర్, ఫిదాయీ శిక్షకుడు కూడా
పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఆఫ్ఘాన్ వైపు ఉన్న టీటీపీ ఫిదాయీలు ఉన్న క్యాంపులపై దాడులు చేయడం లేదంటూ అమెరికా, ఆఫ్ఘనిస్థాన్‌లను పాకిస్థాన్ తరచూ నిందిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా డ్రోన్ దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి టీటీపీ ఫిదాయీలు పాకిస్థాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని తరచూ దాడులు చేస్తున్నాయి.