ప్రధాని వద్దకు వెళ్లబోతున్నా: పవన్ కల్యాణ్
- సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం
- వెంటనే స్పందించాల్సిన సమస్యలపై ప్రధానికి వినతిపత్రం
- పరిటాల సునీతతో భేటీ అనంతరం పవన్ కల్యాణ్
తన టీమ్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని, వారిచ్చే రిపోర్టును బట్టి, వెంటనే స్పందించాల్సిన సమస్యల వివరాలు తీసుకుని మోదీ వద్దకు వెళతానని ఆయన తెలిపారు. సీమలోని ప్రతి జిల్లాకూ తాగు నీరు అందించడం తన తొలి లక్ష్యమని తెలిపారు. ఇదే సమావేశంలో పాల్గొన్న పరిటాల సునీత మాట్లాడుతూ, పవన్ తన ఇంటికి అతిథిగా రావడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. జిల్లా సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని, పవన్ ఇచ్చే సలహా, సూచనలనూ తీసుకుంటామని తెలిపారు.