విశాఖ స్కూల్లో విద్యార్థి మృతి ఘటనపై స్పందించిన మంత్రి లోకేశ్
- విశాఖలో టీచర్ దెబ్బలకు బాలుడు మృతి చెందిన ఘటన
- బాధ్యులు, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తప్పవని హామీ
- మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని లోకేశ్ భరోసా
విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ ప్రైవేట్ పాఠశాలలో ఆరేళ్ల బాలుడు ప్రణయ్ తేజ్ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటనకు బాధ్యులైన వారిపై, పాఠశాల యాజమాన్యంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
ఈ ఘటనపై లోకేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, "విశాఖలోని లిటిల్ గార్డెన్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ కొట్టడంతో ఆరేళ్ల ప్రణయ్ తేజ్ మృతి చెందడం అత్యంత బాధాకరం. బాధ్యులైన వారిపై, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి, మీకు కలిగిన ఈ తీరని లోటును ఎవ్వరూ పూడ్చలేరు. మా ప్రభుత్వం మీకు అన్నివిధాలా అండగా ఉంటుంది" అని తన పోస్టులో పేర్కొన్నారు.
హోంవర్క్ పూర్తి చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టడంతో ప్రణయ్ తేజ్ కుప్పకూలి మరణించాడని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించారు.