'బిచ్చగాడు' అవతారం ఎత్తిన సామాన్యుడు.. ఒక్కరోజు సంపాదన ఎంతంటే?

Common man becomes beggar how much he earned in a day
  • హరిద్వార్‌లో యూట్యూబర్ వినూత్న ప్రయోగం
  • బిచ్చగాడి వేషంలోకి మారిన స్నేహితుడు సచిన్
  • ఒక్క రోజులోనే రూ. 4000 సంపాదించి ఆశ్చర్యం
  • సంపాదన ఎక్కువైనా ఆ పని నరకమన్న యువకుడు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఓ బిచ్చగాడి రోజువారీ సంపాదన ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు ఒక యూట్యూబర్ చేసిన ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రయోగంలో భాగంగా సదరు యూట్యూబర్ స్నేహితుడు యాచకుడి అవతారమెత్తి కేవలం ఒక్క రోజులోనే రూ. 4,000 సంపాదించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

యూట్యూబర్ పురుషోత్తం వశిష్ఠ తన స్నేహితుడు సచిన్‌తో కలిసి హరిద్వార్‌లో ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం, సచిన్ చిరిగిన దుస్తులు ధరించి, ముఖానికి నల్ల రంగు పూసుకుని, మెడలో క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డును తగిలించుకుని యాచకుడిలా మారాడు. అనంతరం హరిద్వార్‌లోని రద్దీగా ఉండే వీధుల్లో తిరుగుతూ యాత్రికులను, స్థానిక దుకాణదారులను యాచించాడు.

ఈ క్రమంలో రోజుకు సుమారు రూ. 2,000 వరకు వస్తాయని వారు తొలుత అంచనా వేశారు. అయితే, రోజు ముగిసే సమయానికి సచిన్ ఏకంగా రూ. 4,000 వసూలు చేశాడు. సంపాదన ఆశాజనకంగా ఉన్నప్పటికీ, యాచించడం అనేది అత్యంత కష్టమైన పని అని సచిన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. రోజంతా తీవ్రమైన ఎండలో తిరగడం, ప్రజల నుంచి ఎదురైన అవమానాలు, ఛీత్కారాలు తనను మానసికంగా ఎంతో కుంగదీశాయని పేర్కొన్నాడు. కొందరు చిల్లర లేదని విసుక్కుంటే, మరికొందరు జాలిపడి తమకు తోచిన సాయం చేశారని వివరించాడు.

ఈ ప్రయోగం అనంతరం, యాచించడం కంటే కష్టపడి సంపాదించడమే మేలని సచిన్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో తన పేరు, ఊరు కూడా వెల్లడించని ఒక అసలైన యాచకుడిని కడా అతను కలిశాడు. ప్రస్తుతం ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది.
Advertisement
Purushottam Vashishth
Beggar experiment
Haridwar
Viral YouTube video
Sachin beggar challenge

More Telugu News