ఉగాండా దేశానికి వెళ్లి నానా బాధలు పడ్డ పాకిస్థాన్ క్రికెటర్లు
- టీ20లీగ్ ఆడేందుకు ఉగాండా వెళ్లిన పాక్ క్రికెటర్లు
- అప్పటికే లీగ్ ను రద్దు చేసిన బోర్డు.. కాంట్రాక్ట్ డబ్బులు కూడా చెల్లించని వైనం
- షాక్ కు గరైన పాక్ ఆటగాళ్లు
అంతేకాదు, కాంట్రాక్ట్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా ఆర్గనైజర్లు చెల్లించలేదు. చివరి నిమిషంలో లీగ్ స్పాన్సర్ తప్పుకోవడంతో అక్కడి బోర్డు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో, మీకు కాంట్రాక్టు డబ్బులు కూడా చెల్లించలేమంటూ చేతులు ఎత్తేసింది. లీగ్ ఆర్గనైజర్లు డబ్బులు చెల్లించకపోవడంతో విమాన సంస్థ టికెట్లను కూడా రద్దు చేసింది. దీంతో, పాక్ ఎంబసీ, పీసీబీ సహకారంతో వీరంతా పాక్ కు తిరిగి చేరుకున్నారు. మరోవైపు, ఈ ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది.