చమురు సెగ.. టాటా షేర్లకు నష్టాలు.. రెండో రోజూ పడిపోయిన మార్కెట్లు
- 187.90 పాయింట్లు కోల్పోయి 77,966.35 వద్ద స్థిరపడ్డ సెన్సెక్స్
- 35.75 పాయింట్లు నష్టపోయి 24,435.95 వద్ద ముగిసిన నిఫ్టీ
- ప్రతికూలంగా మారిన చమురు ధరల పెరుగుదల
- ఛైర్మన్ వైదొలగనున్న నేపథ్యంలో టాటా షేర్లలో అమ్మకాలు
- అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై ఇన్వెస్టర్ల దృష్టి
దేశీయ స్టాక్ మార్కెట్లపై ముడి చమురు ధరల ప్రభావం కొనసాగుతోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు అధిక స్థాయిలో ఉండటం, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశంపై స్పష్టత లేకపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికి టాటా షేర్ల పతనం కూడా తోడవడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి.
బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 187.90 పాయింట్లు కోల్పోయి 77,966.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 35.75 పాయింట్లు నష్టపోయి 24,435.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 24,400 స్థాయికి దిగువకు జారడంతో మరింత ఒత్తిడి కనిపించిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. 24,250 స్థాయి వరకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు.
దేశీయ మార్కెట్‌కు చమురు ధరల పెరుగుదల ప్రతికూలంగా మారుతోంది. భారత్ ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటుంది. ధరలు పెరిగితే ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరగడంతో పాటు వాణిజ్య లోటు కూడా విస్తరించే అవకాశం ఉంది. టాటా సన్స్ ఛైర్మన్‌గా వైదొలగనున్నట్టు చంద్రశేఖరన్ ప్రకటించడంతో ఆ గ్రూప్ షేర్లు నష్టాలు చవిచూశాయి. దీంతో ఓ దశలో సెన్సెక్స్ 600 పాయింట్ల వరకు నష్టపోయింది.
నిఫ్టీలో టీసీఎస్, మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మిడ్‌క్యాప్ సూచీ 0.28 శాతం లాభపడగా.. స్మాల్‌క్యాప్ సూచీ 0.18 శాతం పడిపోయింది.
రంగాల వారీగా చూస్తే ఐటీ సూచీ 1.54 శాతం నష్టపోయి అత్యధికంగా దెబ్బతింది. మరోవైపు పీఎస్‌యూ బ్యాంక్ సూచీ రెండు శాతం లాభపడింది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపైనా ఇన్వెస్టర్ల దృష్టి ఉంది. ఆ గణాంకాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి విధాన నిర్ణయాలపై అంచనాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.