చంద్రబాబు అధ్యక్షతన 20వ ఎస్ఐపీబీ సమావేశం... ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు ఇవే!

Chandrababu Naidu chairs 20th SIPB meeting and approves projects worth 2 lakh crore
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు భేటీ
  • రూ.2.08 లక్షల కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు ఏకగ్రీవ ఆమోదం
  • రాష్ట్రవ్యాప్తంగా 21,627 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు
  • విశాఖ, కర్నూలు, తిరుపతి జిల్లాలకు అత్యధికంగా పెట్టుబడులు
  • లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి నూతన రంగాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి ఊతమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదముద్ర లభించింది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,08,406 కోట్ల విలువైన పెట్టుబడులకు బోర్డు ఏకగ్రీవంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా 21,627 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

20వ ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల పూర్తి వివరాలు:ః

1. ఓకెయిర్ గ్రీన్ ఫ్యూయెల్స్: కర్నూలు జిల్లా, రూ.616 కోట్లు, 130 ఉద్యోగాలు 
2. జాక్సన్ గ్రీన్ రెన్యూవబుల్: కర్నూలు జిల్లా, రూ.1533 కోట్లు, 250 ఉద్యోగాలు 
3. ఎఫ్ పీఈఎల్ రవ్వేద పవర్: విజయనగరం జిల్లా, రూ.480 కోట్లు, 275 ఉద్యోగాలు 
4. వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్: కాకినాడ జిల్లా, రూ.15,000 కోట్లు, 1500 ఉద్యోగాలు 
5. ఆరాధ్యా బయోగ్యాస్: కర్నూలు జిల్లా, రూ.143.47 కోట్లు, 595 ఉద్యోగాలు 
6. ఉషోదయా బయోగ్యాస్: నెల్లూరు జిల్లా, రూ.143.47 కోట్లు, 595 ఉద్యోగాలు 
7. డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా: విశాఖపట్నం, రూ.58,743 కోట్లు, 1250 ఉద్యోగాలు 
8. మునోథ్ లీథియం బ్యాటరీ లిమిటెడ్: తిరుపతి జిల్లా, రూ.500 కోట్లు, 240 ఉద్యోగాలు 
9. ఏఐఎల్ డిక్సన్ ఇండియా లిమిటెడ్: కడప జిల్లా (కొప్పర్తి), రూ.450 కోట్లు, 7000 ఉద్యోగాలు 
10. రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్: అనకాపల్లి జిల్లా, రూ.85,200 కోట్లు, 1880 ఉద్యోగాలు 
11. ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లిమిటెడ్: విశాఖ జిల్లా, రూ.31,387 కోట్లు, 1000 ఉద్యోగాలు 
12. సీఆర్ఆర్ హాస్పిటాలిటీ ఎల్ఎల్‌పీ: తిరుపతి జిల్లా, రూ.192.02 కోట్లు, 200 ఉద్యోగాలు 
13. ఆర్కే 2 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: తిరుపతి జిల్లా, రూ.150 కోట్లు, 150 ఉద్యోగాలు 
14. సన్ రైజ్ హోటల్స్ ఇండియా లిమిటెడ్: కాకినాడ జిల్లా, రూ.54 కోట్లు, 75 ఉద్యోగాలు 
15. జెఎస్పీ హోటల్స్, రిసార్ట్స్ ఎల్ఎల్‌పీ: కృష్ణా జిల్లా, రూ.63.79 కోట్లు, 100 ఉద్యోగాలు 
16. పావులూరి హోటల్స్: తిరుపతి జిల్లా, రూ.58.74 కోట్లు, 150 ఉద్యోగాలు 
17. అగస్త్యా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్: కర్నూలు జిల్లా, రూ.7799.96 కోట్లు, 1000 ఉద్యోగాలు 
18. అక్షత్ గ్రీన్ టెక్ లిమిటెడ్: విశాఖపట్నం జిల్లా, రూ.1600 కోట్లు, 750 ఉద్యోగాలు 
19. కోరమాండల్ ఇంటర్నేషనల్: శ్రీకాకుళం జిల్లా (మూలపేట), రూ.2125 కోట్లు, 400 ఉద్యోగాలు 
20. హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్: చిత్తూరు జిల్లా (కుప్పం), రూ.880 కోట్లు, 447 ఉద్యోగాలు 
21. ఎస్ట్రేలా లాజిస్టిక్స్: విశాఖపట్నం జిల్లా, రూ.90 కోట్లు, 100 ఉద్యోగాలు 
22. గణేష్ సాయి మౌనిష స్టీల్ వైర్స్: విజయనగరం జిల్లా, రూ.66 కోట్లు, 120 ఉద్యోగాలు 
23. వీపీఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: నెల్లూరు జిల్లా (మనుబోలు), రూ.500 కోట్లు, 2000 ఉద్యోగాలు 
24. జయాదిత్యా ఆగ్రో లిమిటెడ్: కర్నూలు జిల్లా, రూ.300 కోట్లు, 350 ఉద్యోగాలు 
25. ప్రిసౌల్ ఆగ్రో ఇండస్ట్రీస్: నెల్లూరు జిల్లా, రూ.330.71 కోట్లు, 1110 ఉద్యోగాలు
Advertisement
Chandrababu Naidu
SIPB Meeting Andhra Pradesh
Industrial Investment AP
Green Energy Projects
Data Centers Vizag
Job Creation Andhra Pradesh

More Telugu News