వీడియో: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడి దుర్మరణం.. గాల్లోకి బంతిలా ఎగిరిన కారు!
- వెలుగులోకి కారు అదుపు తప్పిన దృశ్యాలు
- ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిపై ఆగస్టు 6న ప్రమాదం
- కారు కాంక్రీట్ బారియర్‌ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరిన వైనం
- ప్రమాదంలో అబాన్, అతడి స్నేహితుడు సోను మృతి
- సోదరుడు అలీని కలిసేందుకు వెళుతుండగా ప్రమాదం
గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ మృతి చెందిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి ముందు కారు అదుపు తప్పిన దృశ్యాలు డ్యాష్‌క్యామ్ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై మరింత స్పష్టత వచ్చింది.
ఆగస్టు 6న ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. 21 ఏళ్ల అబాన్‌తో పాటు మరో నలుగురు తెల్లటి హ్యుందాయ్ క్రెటాలో ప్రయాణిస్తున్నారు. రోడ్డుపై వేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. పక్కకు దూసుకెళ్లి కాంక్రీట్ బారియర్‌ను ఢీకొట్టి గాల్లోకి బంతిలా ఎగరడం స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ప్రమాదంలో అబాన్, అతడి స్నేహితుడు సోను(25) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న అజమ్, మహ్మద్ జావెద్, ఉమర్‌కు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
జైలులో ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను కలిసేందుకు అబాన్ ఝాన్సీ వెళుతున్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత అబాన్ అంత్యక్రియలను ప్రయాగ్‌రాజ్‌లోని కసారీ-మసారీ శ్మశానవాటికలో కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. తండ్రి అతీక్ సమాధి పక్కనే అతడిని ఖననం చేశారు.
అతీక్ మరో కుమారుడు అసద్ సమాధి కూడా అదే ప్రాంతంలో ఉంది. అలీ, ఉమర్ (అతీక్ పెద్ద కుమారుడు) ప్రస్తుతం జైళ్లలో ఉండగా.. షరతులతో కూడిన పెరోల్‌పై అంత్యక్రియలకు హాజరయ్యారు. 2023 ఏప్రిల్‌లో ప్రయాగ్‌రాజ్‌లో పోలీసుల సమక్షంలో వైద్య పరీక్షలకు తీసుకెళుతున్న సమయంలో అతీక్, అతడి సోదరుడు అష్రఫ్‌ను ముగ్గురు దుండగులు కాల్చిచంపారు. అంతకుముందే అసద్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.