రాజకీయాల్లోకి రావాలని రజనీ బలంగా కోరుకుంటున్నారా..? అభిమానులతో మళ్లీ భేటీ కానుండడం ఇందుకేనా..?
- ఈ నెల 26 నుంచి 31 వరకు అభిమానులతో భేటీ
- వేదిక చెన్నై, కోడంబాక్కంలో రాఘవేంద్ర కల్యాణ మండపం
- రోజుకు వెయ్యి మందికి అవకాశం
రజనీకాంత్ మరోసారి అభిమానులతో భేటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు రోజుకు వెయ్యి మందితో సమావేశం అయ్యేందుకు రజనీ నిర్ణయించారు. అభిమానులు భారీ సంఖ్యలో రానున్నందున అక్కడ భద్రత కల్పించాలని రజనీ పోలీసులను కోరారు. దీంతో రజనీ రాజకీయాల్లోకి రానున్నారంటూ మరోసారి ప్రచారం ఊపందుకుంది.